
బాధ్యతల స్వీకరణ
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లా ఇన్‌చార్జి వ్యవసాయాధికారిగా భీమిని ఏడీఏ సురేఖ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా వ్య వసాయాధికారి భూక్య ఛత్రునాయక్ ఆకస్మికంగా సెలవుపై ఈ నెల 30 తేదీ వరకు వెళ్లడంతో ఆయన స్థానంలో ఏడీఏకు బాధ్యతలు అప్పగించారు. గతంలోనూ డీఏవో దీర్ఘకాలిక సెలవులో వెళ్లడంతో సురేఖ రెండు నెలల పాటు ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. రెగ్యుల్ డీఏవో రావడంతో భీమిని ఏడీఏగా కొనసాగుతున్నారు. తిరిగి మరోసారి ఇన్‌చా ర్జి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయ టెక్నికల్ ఏడీఏ గోపి, సూపరింటెండెంట్ వసంత్, టెక్నికల్ ఏవో శ్రీనివాస్, ఏవో కృష్ణ, ఏఈవో లు, కార్యాలయ సిబ్బంది సురేఖకు మొక్క అందజేసి స్వాగతం పలికారు.