
ఉద్యమ ప్రతిధ్వని ‘కాళోజీ’
మంచిర్యాలఅగ్రికల్చర్: తెలంగాణ ఉద్యమ ప్రతిధ్వనిగా కాళోజీ నారాయణరావు ప్రజలందరికీ చిరస్మరణీయమని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జి ల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కాళోజీ జయంతి వేడుకల్లో ఆయ న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించా రు. కలెక్టర్ మాట్లాడుతూ.. తన రచనలతో ప్రజల ను చైతన్యపరుస్తూ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పురుషోత్తం, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ ఏవో రాజేశ్వర్ పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి చర్యలు
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీల సమస్యలు పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయానికి చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు రేణికుంట్ల ప్రవీణ్, డీసీపీ ఏ.భాస్కర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్ రావు, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి చాతరాజుల దుర్గాప్రసాద్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పురుషోత్తం, పోలీస్, రెవెన్యూ, శాఖల అధికారులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మానిట రింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
అటవీ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు
మంచిర్యాలఅగ్రికల్చర్: అటవీ భూములు ఆక్రమి స్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టర్ చాంబర్‌లో డీసీపీ ఏ.భాస్కర్, జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్, బెల్లంపల్లి సబ్‌కలెక్టర్ మనోజ్‌తో కలిసి తహసీల్దార్లు, పోలీస్ శాఖ అధికారులు, అటవీ రేంజ్ అధికారులతో అటవీ భూముల ఆక్రమణల ని రోధంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్, రెవె న్యూ, అటవీ శాఖ అధికారులతో జిల్లా టాస్క్‌ఫోర్స్ టీం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.