
రికవరీ ఆభరణాలు తిరిగి బ్యాంక్‌కే..
చెన్నూర్: చెన్నూర్ ఎస్బీఐ బ్రాంచ్‌లో అపహరణకు గురైన బంగారు ఆభరణాలు ఎట్టకేలకు బ్యాంక్‌కే చేరాయి. ఈ బ్రాంచ్‌లో పని చేసే క్యాషియర్ నరిగే రవీందర్ అధికారులకు అనుమానం రాకుండా 10 నెలల వ్యవధిలో 20కిలోల బంగారు ఆభరణాలు, రూ.1.10 కోట్ల నగదు కాజేసిన విషయం తెలిసిందే. గత నెల 23న చెన్నూర్ ఎస్బీఐ బ్రాంచ్‌లో జరి గిన ఈ ఘటనపై ఆర్‌ఎం రితేశ్‌కుమార్ గుప్తా ఫిర్యా దు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 17రో జుల వ్యవధిలోనే సుమారు రూ.18.05 కిలోల బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. రికవరీ చేసిన బంగారు ఆభరణాలను సేఫ్టీ కోసం బ్యాంక్ కస్టడీకి అప్పగించారు. మంగళవారం తెల్లవారుజామున సుమారు 3గంటల ప్రాంతంలో భారీ బందోబస్తు మధ్య జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ దేవేందర్‌రావు చెన్నూర్ ఎస్బీఐ బ్రాంచ్‌లో ఆర్‌ఎం సమక్షంలో అందజేశారు. కాగా, రికవరీ చేసిన 18కిలోల బంగారు ఆభరణాలను సేఫ్ కస్టడీ కోసమే చెన్నూర్ ఎస్బీఐ బ్రాంచ్‌లో భద్రపరిచినట్లు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. కోర్టు ద్వారా వాటిని బ్యాంక్‌కు అప్పగించేందుకు కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. మిగతా ఆభరణాలను త్వరలోనే రికవరీ చేస్తామని చెప్పారు. కేసు విచారణలో భాగంగా ముగ్గురు ప్రధాన నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నట్లు వివరించారు.