
ఆరోగ్య సిబ్బందికి హెపటైటిస్ వ్యాక్సిన్
మంచిర్యాలటౌన్: జిల్లాలోని వైద్యులు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులందరికీ హెపటైటిస్ వ్యాక్సిన్ వేయనున్నట్లు ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్ అనిత తెలిపారు. జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్యకేంద్రంలో మంగళవారం ఎంసీహెచ్, జీజీహెచ్‌లో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది, పారిశుధ్య సిబ్బందికి హెపటైటిస్ బీ వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హెపటైటిస్ వ్యాధి బారిన పడ్డ వారికి వైద్యం అందించే వైద్యులు, సిబ్బందితోపాటు ఆస్పత్రుల్లో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బందికి వ్యాక్సిన్ మొదటి విడతలో వేయనున్నట్లు తెలిపారు. హెపటైటిస్ ఉన్న వ్యక్తుల నుంచి రక్తం, చెమట ద్వారా ఇతరులకు వ్యాపించే అవకాశం ఉన్నందున రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాయని తెలిపారు. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి, సూపరింటెండెంట్ విశ్వేశ్వర్‌రెడ్డి, డాక్టర్ అనిల్, ఆర్‌ఎంవో డాక్టర్ భీష్మ, డాక్టర్ శ్రీధర్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ కృపాబాయి, నాందేవ్, వెంకటేశ్వర్లు, లింగారెడ్డి, పద్మ, డెమో వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.