ఆత్మహత్యే పరిష్కారం కాదు.. | - | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యే పరిష్కారం కాదు..

Sep 10 2025 3:45 AM | Updated on Sep 10 2025 3:45 AM

ఆత్మహత్యే పరిష్కారం కాదు..

ఆత్మహత్యే పరిష్కారం కాదు..

● ఒక్క క్షణం ఆలోచించండి ● సమస్యలను ధైర్యంగా ఎదుర్కొందాం.. ● నేడు ఆత్మహత్యల నివారణ దినోత్సవం

చిన్న సమస్యలు, పెద్ద నష్టాలు

జీవితంలో ఎదురయ్యే సవాళ్లు అందరికీ సహజం. పరీక్షల్లో తక్కువ మార్కులు, దాంపత్య కలహాలు, ప్రేమలో విఫలంకావడం, ఉద్యోగ అవకాశాలు దొరకకపోవడం, అప్పుల భారం, వ్యవసాయంలో నష్టాలు, ఇలాంటి సమస్యలు ఎవరినైనా కలవరపరుస్తాయి. కానీ ఈ సమస్యలు శాశ్వతం కాదు. క్షణికావేశంలో తీసుకునే తప్పుడు నిర్ణయాలు కుటుంబాన్ని, సన్నిహితులను శాశ్వత బాధలో ముంచెత్తుతాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు మంచిర్యాల జిల్లాలో 275 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇందులో ఎక్కువగా యువతే ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

ఒక్క క్షణం ఆలోచిస్తే...

సమస్యలు ఎంత పెద్దవైనా, ఆలోచనాత్మకంగా విశ్లేషిస్తే పరిష్కారం దొరుకుతుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా నిపుణులతో సమస్యను పంచుకోవడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఆరోగ్య సమస్యలైతే వైద్యులను సంప్రదించడం, కుటుంబ కలహాలైతే కౌన్సిలింగ్‌ తీసుకోవడం, ఉపాధి కోసం కొత్త అవకాశాలను వెతకడం వంటి చర్యలు సమస్యల నుంచి బయటపడేందుకు సహాయపడతాయి. ఆత్మహత్య ద్వారా సమస్యలు తొలగిపోవని, అది కేవలం కన్నవారికి, కుటుంబానికి జీవితాంతం బాధను మిగిల్చే చర్య అని గుర్తించాలి.

జిల్లాలో 2023 నుండి 2025 ఆగస్టు వరకు ఆత్మహత్యలు

మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు చిన్న సమస్య కూడా కొండంతగా కనిపిస్తుంది. దీనికి పరిష్కారం లేదేమో అనిపిస్తుంది. కానీ, ధైర్యంగా, మనో నిబ్బరంతో ఉంటే.. పెద్ద సమస్య కూడా చిన్నగా మారుతుంది. పరిష్కారం దొరుకుతుంది. కానీ నేడు చాలా మంది క్షణికావేశంలో, చి న్న చిన్న సమస్యలు ఎదుర్కొనలేక ఆత్మహత్యే శరణ్యం అనుకుంటున్నారు.

దీంతో జిల్లాలో ఆత్మహత్యల రేటు

ఆందోళనకరంగా పెరుగుతోంది. ము ఖ్యంగా 18 నుంచి 35 ఏళ్ల వయస్సు గలవారిలో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. బుధవారం ఆ త్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా కథనం. – మంచిర్యాలక్రైం

జిల్లాలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు..

Ä దండేపల్లి మండలం కొర్విచెల్మ గ్రామానికి చెందిన వేనంక వినయ్‌బాబు (26) అదే గ్రామానికి చెందిన దుంపాటి హితవర్షిణి (20) ప్రేమించుకున్నారు. హితవర్షిని వ్యక్తి గత కారణాల వల్ల ఈనెల 7న రైలుకిందపడి ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలు లేని జీవితం తనకు వద్దనుకున్న వినయ్‌బాబు ఈనెల 8న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

Ä మూడు నెలల కాలంలో జిల్లా కేంద్రంలోని సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్సియల్‌ బాలికల వసతి గృహంలో ఇద్దరు విద్యార్థులు, ఓ ప్రైవేటు కళాశాల వసతి గృహంలో మరో విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కలకలం రేపాయి.

Ä మంచిర్యాలకు చెందిన ఓ విద్యార్థిని హన్మకొండలో ఎస్‌ఆర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. అక్కడ చదవడం ఇఫ్టంలేక రెండు నెలల క్రితం హాస్టల్‌ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

మార్పును గమనించాలి...

ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారి ఆలోచనలు భిన్నంగా కనిపిస్తాయి. వారిపై కన్నేసి ఉంచాలి. ఈ ఆలోచన కలిగిన వారు మనోవేదనకు గురవుతున్నట్లు అనిపిస్తే వారితో మాట్లాడి సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యులు ఓదార్చి కొండంత ధైర్యాన్ని ఇవ్వాలి. మేమున్నామంటూ భరోసా కల్పించాలి.

– ఎగ్గడి భాస్కర్‌,

డీసీపీ, మంచిర్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement