
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా హిమతేజ
ఆదిలాబాద్: తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆల్ ఇండియా బుచ్చి బాబు ఇన్విటేషనల్ టోర్నమెంటులో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన క్రికెటర్ కొడిమెల హిమతేజ మంగళవారం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. చెన్నయ్ వేదికగా హెచ్‌సీఏ, టీఎన్‌సీఏ ప్రెసిడెంట్ ఎలెవన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో హెచ్‌సీఏ చాంపియన్‌గా నిలిచింది. మొదటి ఇన్నింగ్స్‌లో హిమతేజ 97 పరుగులతో సత్తా చాటాడు. ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. నిర్వాహకులు జ్ఞాపికతోపాటు రూ.10,000 నగదు బహుమతి అందజేశారు.