
విద్యుత్‌షాక్‌తో వ్యవసాయ కూలీ..
కడెం: గడ్డి కోస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై వ్యవసాయ కూలీ మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..కొండుకూర్ గ్రామానికి చెందిన సంగెం రాజేందర్ (36) మంగళవారం అదే గ్రామానికి చెందిన సంజీవ్‌రెడ్డి వరి పొలం చుట్టూ గ్రాస్‌కట్టర్‌తో గడ్డి కోస్తుండగా వ్యవసాయబావి పక్కన ఉన్న విద్యుత్ వైరు యంత్రానికి చుట్టుకోవడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు ఆందోళన చేపట్టడంతో కడెం, దస్తురాబాద్ ఎస్సైలు సాయికిరణ్, సాయికుమార్ సంఘటన స్థలానికి చేరుకుని వారికి నచ్చజెప్పారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమ్తితం ఖానాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతునికి భార్య నీరజ, కుమారుడు, కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై సాయికిరణ్ తెలిపారు.