
గురుకుల విద్యార్థులకు వైద్య పరీక్షలు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల ము న్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నంనూర్‌లో గల చందన్‌పూర్ పునరావాస కాలనీలో ఉన్న తెలంగాణ రాష్ట్ర అర్బన్ డెవలప్‌మెంట్ గురుకుల పాఠశాలలోని 16 మంది విద్యార్థులు సోమవారం రాత్రి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం కలెక్టర్ కుమార్‌దీపక్ ఆదేశాల మేరకు పాఠశాలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి 16 మందితో పాటు మిగతా విద్యార్థులకు వైద్యపరీక్షలు చేశారు. విద్యార్థులంతా సురక్షితంగా ఉన్నారని, తరగతి గదుల్లో దోమల మందు స్ప్రే చేయించడం వలన చిన్న అనారోగ్య సమస్య తలెత్తిందని, ఒక్క విద్యార్థికి మాత్రం కళ్లలో మంటలు ఉన్నందున చికిత్స అందించామని ఇన్‌చార్జి వైద్యాధికారి డాక్టర్ అనిత తెలిపారు.
పాఠశాలను సందర్శించిన వైద్యాధికారి
అస్వస్థతకు గురైన విద్యార్థులను చూసేందుకు జిల్లా ఇన్‌చార్జి వైద్యాధికారి డాక్టర్ అనిత పాఠశాలను సందర్శించారు. పాఠశాల పరిసరాలు, తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, పౌష్టికాహారం తీసుకోవాలని, దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.