
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
ఇచ్చోడ: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వా యి వద్ద చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని రెడ్డికాలనీకి చెందిన ఏనుగు నర్సింహారెడ్డి (21) మూడురోజుల క్రితం తల్లిదండ్రులతో కలిసి సొంత పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్లాడు. తల్లిదండ్రులు సోమవారం రాత్రి ఇచ్చోడకు చేరుకోగా నర్సింహారెడ్డి అక్కడే ఉన్నాడు. మంగళవారం తెల్లవారుజామున మేనబావ అయిన విశాల్‌రెడ్డితో కలిసి హైదరాబాద్ నుంచి కారులో వస్తుండగా ఇందల్వా యి వద్ద రోడ్డు పక్కన ఆగి వున్న కంటెయినర్‌ను ఢీకొట్టా రు. ఘటనలో నర్సింహారెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా కారు నడుపుతున్న విశాల్‌రెడ్డికి స్వల్పగాయాలయ్యాయి. మృతదేహాన్ని నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించి తరలించారు. అంత్యక్రియల్లో బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్, ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపురావు, అడ్డి భోజారెడ్డి, దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి