
కవి ‘తుమ్మల’కు కీర్తి పురస్కారం
నిర్మల్‌ఖిల్లా: నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ప్ర ముఖ కవి, చరిత్ర పరిశోధకుడు తుమ్మల దేవరావును ప్రతిష్టాత్మక సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కారం వరించింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధరంగాల్లో కృషి చేస్తున్న 48 మందిని పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ మేరకు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు ఆచార్య వెల్దండ నిత్యానందరావు పురస్కార గ్రహీతల వివరాలను మంగళవారం వెల్లడించారు. ఈ నెల 23, 24 తేదీల్లో రూ.5,116 నగదు, పురస్కారంతో సత్కరించనున్నారు. దేవరావు తన పరిశోధనలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 17 శాసనా లను వెలుగులోకి తీసుకొచ్చారు. 2000లో ‘నిర్మల్ జిల్లా కథలు’ పేరిట సుమారు 80 ధారావాహికలు ఆలిండియా రేడియోలో ప్రసారమయ్యాయి. శాతవాహన రాష్ట్ర కోట, కాకతీయ, అసఫ్‌జాహీ, నిజాం, కళ్యాణి చాళక్యులకు సంబంధించిన అనేకమైన చారిత్రక అంశాలను నమోదు చేశారు. వీరి పరిశోధనలు గుర్తించిన తెలుగు విశ్వవిద్యాలయం 2024 సంవత్సరానికిగానూ కీర్తి పురస్కారానికి ఎంపిక చేసింది.