రైతుల ఆందోళన.. | - | Sakshi
Sakshi News home page

రైతుల ఆందోళన..

Sep 9 2025 1:12 PM | Updated on Sep 9 2025 1:12 PM

రైతుల

రైతుల ఆందోళన..

● కోటపల్లి మండల కేంద్రంలోని పీఏసీఎస్‌లో యూరియా బస్తాలు పంపిణీ చేస్తున్నారనే విషయం తెలుసుకుని సోమవారం వేకువజాము నుంచే రెండు వేల మంది బారులు తీరారు. అధికారులు ఒక వ్యక్తి ఒకే బస్తా చొప్పున 600 మందికి పంపిణీ చేయగా.. మిగతా వారు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. ఎస్సై రాజేందర్‌ బందోబస్తు నిర్వహించారు. ● భీమారం మండల కేంద్రంలోని ఫర్టిలైజర్‌ దుకాణం వద్ద సోమవారం యూరియా కోసం రైతులు బారులు తీరారు. 444బస్తాలతో లారీ రాగా.. ఒక్కో రైతుకు ఒక్కో బస్తా మాత్రమే పంపిణీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది రైతులకు యూరియా లభించలేదు. మండలంలోని కాజిపల్లి, భీమారానికి కలిపి 30టన్నుల యూరియా వచ్చిందని, ఇంకా రావాల్సి ఉందని మండల వ్యవసాయ అధికారి సుధాకర్‌ తెలిపారు. ● వేమనపల్లి మండలం సుంపుటం, ముల్కలపేట గ్రామాల్లో రైతులు యూరియా కోసం వేచి చూశారు. కొందరికే యూరియా బస్తాలు అందజేయగా మరికొందరు వెనుదిరిగారు. అవసరమైన సమయంలో యూరియా లేదంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ● దండేపల్లి మండలం గూడెంలో సోమవారం సహకార సంఘం తెరువక ముందే యూరియా కోసం వచ్చిన రైతులు పట్టాపాస్‌బుక్‌ల జిరాక్స్‌ ప్రతులు వరుసలో ఉంచారు. నెల్కివెంకటాపూర్‌ సహకార సంఘం వద్ద 200 బస్తాలు స్టాకు ఉండడంతో రైతులు బారులు తీరారు. రెండు గంటల్లో అయిపోవడంతో మూసివేశారు. సోమవారం సాయంత్రంకల్లా మరో 30 టన్నుల స్టాకును అందుబాటులో ఉంచినట్లు ఏవో అంజిత్‌కుమార్‌ తెలిపారు. ద్వారక, ముత్యంపేట రైతువేదికల వద్ద మంగళవారం మధ్యాహ్నం యూరియా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

చెన్నూర్‌/కోటపల్లి/భీమారం/వేమనపల్లి/దండేపల్లి: ఎరువుల కోసం రైతులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. చెన్నూర్‌ ఎరువులు గిడ్డంగుల సముదాయానికి సోమవారం తెల్లవారు జామునే చేరుకున్నారు. నాలుగు గంటలైనా అధికారులు రాకపోవడంతో అటవీ కార్యాలయం, ఐబీ చౌరస్తాలో బైఠాయించారు. ప్రైవేటు డీలర్‌ వద్దకు వెళ్తున్న ఎరువుల లారీని రైతులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. రైతులకు ఇవ్వకుండా ప్రైవేటులో ఎలా అమ్ముకుంటారని ఆందోళన చేపట్టారు. లారీలోని ఎరువుల బస్తాలు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు నచ్చజెప్పి ఎరువుల గోదాం వద్దకు తీసుకొచ్చారు. సాయంత్రం వరకు గోదాం వద్ద పడిగాపులు కాస్తున్నా వ్యవసాయ అధికారులు స్పందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు వ్యవసాయ అధికారులతో మాట్లాడి మంగళవారం ఎరువులు పంపిణీ చేస్తామని చెప్పడంతో రైతులు స్వగ్రామాలకు వెళ్లిపోయారు.

పహారా మధ్య పంపిణీ

లక్సెట్టిపేట: లక్సెట్టిపేటలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి సోమవారం యూరియా స్టాక్‌ వచ్చిందని తెలియడంతో రైతులు ఒక్కసారిగా వచ్చారు. పోలీసు పహారా మధ్య పంపిణీ చేశారు. 222 బస్తాల మాత్రమే రావడంతో ఒక్కో రైతుకు రెండు చొప్పున అందజేశారు. మరికొందరు రైతులు వెనుదిరిగి వెళ్లారు. 400కు పైగా దరఖాస్తులు ఉన్నాయని, స్టాక్‌ రాగానే అందజేస్తామని సిబ్బంది తెలిపారు. సంఘం సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ యూరియా పంపిణీలో అవకతవకలకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపించారు.

రైతుల ఆందోళన..1
1/2

రైతుల ఆందోళన..

రైతుల ఆందోళన..2
2/2

రైతుల ఆందోళన..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement