
ఉపాధ్యాయులే మార్గదర్శకులు
మంచిర్యాలఅగ్రికల్చర్: విద్యార్థులకు గుణాత్మక విద్యనందించి మంచి భవిష్యత్ రూపొందించడంలో ఉపాధ్యాయులు మార్గదర్శకులుగా పని చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్యతో కలిసి ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆరు వేల మంది విద్యార్థులు అదనంగా చేరారని తెలిపారు. అనంతరం రాష్ట్ర, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు 71 మందిని సన్మానించి పురస్కారాలు అందజేశారు.