
‘కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాల అభివృద్ధి’
నెన్నెల: కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాలు అభివృద్ధి చెందాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ అన్నారు. సోమవారం మండలంలోని నందులపల్లిలో కన్నెపల్లి, భీమిని, నెన్నెల మండలాల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు అంగలి శేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ పల్లె ప్రాంత ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఖర్జీ, ఆవుడం, చిత్తాపూర్ గ్రామాలకు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు పది మంది బీజేపీలో చేరారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్‌రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజీ, మాజీ ఎమ్మెల్యే అమరాజుల శ్రీదేవి, జిల్లా కార్యదర్శి ఠాకూర్ ఉదయ్‌శ్రీ, భీమిని, కన్నెపల్లి మండలాల అధ్యక్షులు కొంక సత్యనారాయణ, ఆశన్న, నాయకులు నల్ల రాజేందర్, శైలేందర్‌సింగ్ పాల్గొన్నారు.