
ఏజెంట్ల పోరాట ఫలితంగానే జీఎస్టీ తొలగింపు
పాతమంచిర్యాల: ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా చేసిన పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఎల్‌ఐసీ పాలసీలపై జీఎస్టీని తొలగించిందని ఆ సంఘం కరీంనగర్ డివిజన్ కన్వీనర్ పాలమాకుల రాజబాబురెడ్డి అన్నారు. పాలసీలపై జీఎస్టీ రద్దు నిర్ణయాన్ని హర్షిస్తూ సోమవారం జిల్లా కేంద్రంలోని ఎల్‌ఐసీ కార్యాలయ ఆవరణలో మిఠాయిలు పంపిణీ చేశారు. పాలసీలపై జీఎస్టీ రద్దు కోసం దేశవ్యాప్తంగా ఏజెంట్లు పోరాటాలు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర నాయకులు గాదాసు శ్రీనివాస్, విశ్వనాథుల వెంకటేష్, కుమారస్వామి, మహేష్, జక్కుల కుమార్, లక్ష్మి నారాయణ, శ్రీనివాస్, భూమయ్య, ఆశీర్విల్సన్, లక్ష్మినారాయణ, ముత్తె రమేష్, ఐసీఈయూ నాయకులు రంగు రాజేశం, మోతే రామదాసు పాల్గొన్నారు.