
10న ఓటర్ల తుది జాబితా
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఈ నెల 10న ఫో టో ఓటర్ల తుది జాబితా ప్రదర్శిస్తామని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో జెడ్పీ సీఈఓ గణపతి, డీపీఓ వెంకటేశ్వర్‌రావులతో కలిసి జిల్లాలోని అన్ని పార్టీల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితా తయారు, పోలింగ్ కేంద్రాల ఎంపిక, వార్డుల విభజన వంటి వాటిపై సలహాలు, సూచనలు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో మరోసారి పర్యవేక్షించి తుది జాబితా ప్రదర్శిస్తామని తెలిపారు.