
అప్పు చెల్లిస్తాం.. మా బంగారం ఇవ్వండి
చెన్నూర్: బ్యాంక్‌లో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న అప్పు చెల్లిస్తామని, బంగారు నగలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గోల్డ్‌లోన్ బాధితులు సోమవారం చెన్నూర్ ఎస్బీఐ ఎదుట ధర్నా చేశారు. ముందుగా బ్యాంక్ మేనేజర్‌ను కలువగా.. నగలు ఎప్పుడు ఇస్తారో తనకు తెలియదని, రీజినల్ మేనేజర్‌కు ఈ విషయం తెలియజేస్తానని చెప్పారు. దీంతో బాధితులు బ్యాంక్ ఎదుట బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రికవరీ అయిన నగలను పోలీసుల నుంచి స్వాధీనం చేసుకుని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.