
నువ్వు లేక నేను లేను..!
లక్సెట్టిపేట/సికింద్రాబాద్: ఇద్దరిదీ ఒకే ఊరు.. మనసులు కలిశాయి. ప్రేమించుకున్నారు. మనువా డాలనీ అనుకున్నారు. ఏమైందో తెలియదు గానీ యువతి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణాన్ని తట్టుకోలేక ఒక్క రోజు వ్యవధిలో నే యవకుడు బావిలో దూకి బలవన్మరణం చెందా డు. పోలీసులు, జీఆర్‌పీ హెడ్‌కానిస్టేబుల్ డేవిడ్‌రాజు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొర్విచెల్మ గ్రామానికి చెందిన వేనంక వినయ్‌బాబు(26) డిగ్రీ పూర్తి చేశాడు. తల్లి రాజవ్వతో కలిసి గ్రామంలో ఉంటున్నాడు. ఇదే గ్రామానికి చెందిన దుంపటి హితవర్షిణి(20) ఇంజినీరింగ్ చదువుతోంది. వీరిద్దరూ ప్రే మించుకుంటున్నారు. హితవర్షిణి కుటుంబం ప్రస్తు తం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఉంటోంది.
రైలు కిందపడి యువతి..
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో నివాసం ఉంటున్న ప్రైవేటు ఉద్యోగి అంజన్న కూతురు దుంపటి హితవర్షిణి ఘట్‌కేసర్‌లోని విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏఐ అండ్ డీఎస్ ఫైనలియర్ చదువుతోంది. సెలవుల కారణంగా మూడు రోజుల క్రితం ఆర్మూర్‌కు వెళ్లింది. ఆదివారం మధ్యాహ్నం నిజామాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులో సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్‌కు చేరుకుంది. అక్కడి నుంచి మెట్రో రైలు ఎక్కి ఉప్పల్ స్టేషన్‌లో దిగింది. అక్కడి నుంచి ఆటోలో ఘట్‌కేసర్ చేరుకున్న హితవర్షిణి సమీపంలోని రైల్వేట్రాక్ వద్దకు వెళ్లి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఘట్‌కేసర్–బీబీనగర్ రైల్వేస్టేషన్ల మధ్య ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై సిర్పూర్–కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైలు లోకోపైలట్ సమాచారం అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని జీఆర్‌పీ హెడ్‌కానిస్టేబు ల్ డేవిడ్ రాజు తెలిపారు.
మృతుడు
వినయ్‌బాబు(ఫైల్)
మృతురాలు
హితవర్షిణి (ఫైల్)
హనవ్వ దగ్గరికే వెళ్తున్నా..!
హితవర్షిణి మృతిని వేనంక వినయ్‌బాబు తట్టుకోలేకపోయాడు. మనోవేదనకు గురైన అతడు లక్సెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో సోమవారం దూకాడు. స్థానికులు గమనించి బావిలో నుంచి తీసేసరికి చనిపోయాడు. ‘‘హనవ్వ(హితవర్షిణి) కోసం ఏం చేయడానికై నా సిద్ధం. నా పంచ ప్రాణాలు.. అందుకే హనవ్వ దగ్గరికే వెళ్తున్నా.. అమ్మా, నాన్న, బాబాయి నన్ను క్షమించండి’’ అంటూ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. మృతుడి తల్లి రాజవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై గోపతి సురేష్ తెలిపారు.

నువ్వు లేక నేను లేను..!