కాసిపేట: గత ఆర్థిక సంవత్సరం సింగరేణి సాధించిన లాభాలు ప్రకటించి 35 శాతం వాటా కార్మికులకు చెల్లించాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. సోమవారం కాసిపేట గనిపై ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్‌లో మాట్లాడారు. గత సీఅండ్‌ఎండీతో జరిగిన స్ట్రక్చర్ మీటింగ్‌లో సొంతింటి పథకం అమలు చేయాలని కోరగా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. డిస్మిస్ అయిన జేఎంటీలను విధుల్లోకి తీసుకునేందుకు సర్క్యూలర్ జారీ అయ్యిందన్నారు. ఇతర ఉద్యోగులకు సైతం ఐదేళ్లలో వంద మస్టర్లు ఉంటే విధుల్లోకి తీసుకునేందుకు యాజమాన్యం ఒప్పుకుందన్నారు. ఈనెల 12న సీఅండ్‌ఎండీతో జరిగే సమావేశంలో కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ సెంట్రల్ సెక్రెటరీ అక్బర్ అలీ, బెల్లంపల్లి బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేశ్, బ్రాంచి ఇన్‌చార్జి చిప్ప నర్సయ్య, మందమర్రి బ్రాంచి కార్యదర్శి సత్యనారాయణ, నాయకులు మీనుగు లక్ష్మీనారాయణ, నాగేశ్వరరావు, రాజేందర్, లింగయ్య, రఘురాం, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.