15న లాభాల వాటా కోసం ధర్నా | - | Sakshi
Sakshi News home page

15న లాభాల వాటా కోసం ధర్నా

Sep 9 2025 1:10 PM | Updated on Sep 9 2025 1:10 PM

15న లాభాల వాటా కోసం ధర్నా

15న లాభాల వాటా కోసం ధర్నా

● సీఐటీయూ అధ్యక్షుడు రాజారెడ్డి

శ్రీరాంపూర్‌: కార్మికులకు కంపెనీ సాధించిన లాభా ల నుంచి 35 శాతం వాటా చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 15న సింగరేణి వ్యాప్తంగా జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు సీఐ టీయూ కేంద్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి తెలి పారు. సోమవారం ఆర్కే 5 గనిని సందర్శించి కార్మికులతో మాట్లాడారు. కంపెనీ లాభాల వాటా చెల్లించడంలో తీవ్ర జాప్యం చేస్తుందన్నారు. ఏప్రిల్‌ 1నే ఉత్పత్తిని ప్రకటిస్తున్న అధికారులు లాభాలను మాత్రం ప్రకటించడానికి నెలలు గడుపుతున్నారన్నారు. వాస్తవ లాభాలను సత్వరమే ప్రకటించాల ని డిమాండ్‌ చేశారు. ఈ నెల 11, 12 తేదీల్లో సొంతింటి పథకంపై తమ యూనియన్‌ ఆధ్వర్యంలో కార్మికుల అభిప్రాయ సేకరణకు బ్యాలెట్‌ విధానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్‌ బ్రాంచ్‌ అధ్యక్షుడు గుల్ల బాలాజీ, నాయకులు వెంగల శ్రీనివాస్‌, సురేందర్‌, ఇప్ప నరేష్‌, తిరుపతి, వెంకటేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement