
వంతెన నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరు
నెన్నెల: మండలంలోని గంగారం పెద్ద చెరువు మత్తడి వాగుపై వంతెన నిర్మాణానికి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ రూ.3 కోట్ల 15 లక్షల ఐటీడీఏ నిధులను మంజూరు చేశారు. ఆదివా రం గంగారం, చిన్నవెంకటాపూర్, కొత్తూర్ గ్రా మాల ప్రజలు ఎమ్మెల్యే చిత్రపటానికి క్షీరాభిషే కం చేశారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో దశాబ్దాల కల సాకారం కానుందని, ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బ్రిడ్జి నిర్మాణంతో రవాణా సౌకర్యాలు మెరుగుపడి తమ కష్టాలు తీరనున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ గంగారాం గ్రామశాఖ అధ్యక్షుడు జాడి రాజ్‌కుమార్‌ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్రీరాముల దేవేందర్, తిరుమలేష్, బిస్మయ్య, జలీల్,స్వామి, రెడ్డి, కస్తూరి పోశం, అంకయ్య, తదితరులు పాల్గొన్నారు.