
శాంతిభద్రతలు కాపాడాలి
లక్సెట్టిపేట: ప్రజల శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు కృషి చేయాలని డీసీపీ భాస్కర్ అన్నారు. శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, వినాయక నిమజ్జనానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పోలీసులు అంటే ప్రజలకు విశ్వాసం, నమ్మకం ఉండేలా చూసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ సమయపాలన పాటిస్తూ క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాష్, సీఐ రమణామూర్తి, ఎస్సై గోపతి సురేష్, సిబ్బంది పాల్గొన్నారు.