
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
దండేపల్లి: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు డిమాండ్ చేశారు. మండలంలో ని గుడిరేవు, లక్ష్మీకాంతపూర్ గోదావరి తీర ప్రాంతాల్లో వరద ఉధృతికి దెబ్బతిన్న పంట లను మంగళవారం ఆయన బీఆర్‌ఎస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎకరాకు రూ.40వేల పరిహారం అందించాలని అన్నా రు. అనంతరం నెల్కివెంకటాపూర్ సహకార సంఘం వద్ద యూరియా కోసం వచ్చిన రైతులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ లోపంతోనే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని, దీంతో రైతులు యూరి యా కోసం వరుసలో నిలబడాల్సిన పరిస్థితులు తలెత్తాయని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి యూరియా కొరత లేకుండా చూ డాలని అన్నారు. మాజీ వైస్‌ఎంపీపీ అనిల్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు రవీందర్, రాజమల్లు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.