
మళ్లీ రోడ్డెక్కిన రైతులు
చెన్నూర్/లక్సెట్టిపేట/దండేపల్లి/జన్నారం: చెన్నూర్‌లో రైతులు యూరియా కోసం మళ్లీ రోడ్డెక్కారు. సోమవారం మంత్రి క్యాంపు కా ర్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన విష యం తెలిసిందే. మంగళవారం స్థానిక ఎరువులు గిడ్డంగుల సముదాయంలో 350 బస్తాల యూరియా ఉండగా పంపిణీకి అధికారులు అందుబాటులో లేరని సొసైటీ చైర్మన్ చల్లా రాంరెడ్డి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో ఆగ్రహించిన రైతులు స్థానిక ఐబీ చౌరస్తాలో బైఠాయించారు. గంటపాటు రాస్తారోకో చేశారు. సీఐ దేవేందర్‌రావు రైతులతో మాట్లా డి ఆందోళన విరమింపజేశారు. రెండ్రోజుల్లో మరో 40టన్నుల ఎరువులు వస్తాయని వ్యవసాయ అధికారులు తెలిపారు. గురువారం 420ఎరువుల బస్తాలు వస్తాయని, పోలీసులు దగ్గరుండి పంపిణీ చేయిస్తారని సీఐ తెలిపారు. లక్సెట్టిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి మంగళవారం ఎరువులు వచ్చాయని తెలియడంతో రైతులు భారీగా తరలివచ్చారు. 444బస్తాలు రాగా.. ఎక్కువమంది ఉండడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రైతుల పాస్‌బుక్, ఆధార్‌కార్డు పరిశీలించి యూరియా పంపిణీ చేయించారు. దండేపల్లి మండలం నెల్కివెంకటపూర్ సహకార సంఘానికి 666బస్తాలు, గూడెం సహకార సంఘానికి 444, లింగాపూర్, నాగసముద్రం హాక సెంటర్లకు 222 బస్తాల చొప్పున యూరియా వచ్చింది. మంగళవారం నెల్కివెంకటాపూర్, గూడెం సహకార సంఘాల వద్దకు రైతులు భారీగా చేరుకున్నారు. పోలీసులు అందరినీ వరుసలో నిలబెట్టి యూరియా పంపిణీ చేశారు. జన్నారం మండలం తపాలపూర్ గ్రామంలో మంగళవారం 266బస్తాల యూరియా రాగా.. సిగ్నల్ లేక రైతులకు ఓటీపీ ఆలస్యంగా రావడంతో గంటలకొద్దీ వేచి చూడాల్సి వచ్చింది. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 125 బస్తాల యూరియా బస్తాలు మాత్రమే పంపిణీ జరిగిందని రైతులు కమ్మల విజయధర్మా, రవి ఆరోపించారు. పొనకల్ సొసైటీలో కూడా రైతులు బారులు తీరారు.
నెల్కివెంకటాపూర్ వద్ద వేచి ఉన్న రైతులు
లక్సెట్టిపేటలో యూరియా కోసం వచ్చిన రైతులు

మళ్లీ రోడ్డెక్కిన రైతులు

మళ్లీ రోడ్డెక్కిన రైతులు