
పెండింగ్ వేతనాలు చెల్లించాలని ధర్నా
మంచిర్యాలఅగ్రికల్చర్: గత ఐదు నెలల పెండింగ్ ఉన్న వేతనాలు చెల్లించాలని, 104 కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాల ని డిమాండ్ చేస్తూ తెలంగాణ యునైటెడ్ మె డికల్ అండ్ హెల్త్ ఎంపాయిస్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ స మానపనికి సమాన వేతనం చెల్లించాని, ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలని, ట్రెజరీ ద్వా రా వేతనాలు చెల్లిచాలని అన్నారు. జిల్లా ఆరో గ్య శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఉద్యోగులు కే.శ్రీనివాస్, ఎస్.శ్రీనివాస్, సత్యం, పురుషోత్తం, హేమకుమారి, జయ, స్వప్న, శంకరమ్మ, శిరీష పాల్గొన్నారు.