
రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత
మంచిర్యాలఅగ్రికల్చర్: రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు కచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో డీసీపీ ఏ.భాస్కర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి రెవెన్యూ, పోలీసు, రవాణా, రోడ్లు–భవనాలు శాఖ, జాతీయ రహదారుల సంస్థ, ఆర్టీసీ అ ధికారులు, మున్సిపల్ కమిషనర్లు, వైద్యారోగ్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రమాదాలు జరిగే ప్రాంతా లు(బ్లాక్ స్పాట్) గుర్తించి సూచిక బోర్డులు ఏర్పా టు చేయాలని తెలిపారు. రోడ్లపై ఉండే పశువులను తరలించేందుకు జిల్లా కేంద్రంలో గోశాల ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఆ ర్డీవో శ్రీనివాస్‌రావు, మంచిర్యాల, బెల్లంపల్లి ఏసీపీలు ప్రకాష్, రవికుమార్, జిల్లా రవాణా అధికారి సంతోష్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఫిజికల్ ఐడియాథాన్
మంచిర్యాలఅగ్రికల్చర్: యువత, అధ్యాపకుల్లో వ్యవస్థాపక స్ఫూర్తిని పెంపొందించేందుకు ఫిజికల్ ఇన్నోవేషన్ ఫర్ తెలంగాణ యూత్ 2.0 తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) ఆధ్వర్యంలో ఫిజికల్ ఐడియాథాన్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఒక్కరోజు శిక్షణ కార్యక్రమానికి జిల్లా ఉపాధి అధికారి రవికృష్ణ, టాస్క్ జిల్లా మేనేజర్ సాయికుమార్, ఐ4టీవై ప్రాజెక్టు మేనేజర్ బాలు ప్రవరాఖ్య, హెడ్ హెల్డ్ పౌండేషన్ ప్రతినిధులతో కలిసి హాజరై ఆవిష్కరణలు పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ 160 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా 140 మంది హాజరయ్యారని తెలిపారు. మిమ్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు దినేష్ కార్తీక్ బృందం తయారు చేసిన ప్రోటో టైప్ ఆవిష్కరణలను పరిశీలించి సూచనలు చేశారు.