
లోక్ అదాలత్ విజయవంతం చేయాలి
లక్సెట్టిపేట: వచ్చే నెల 13న కోర్టు ఆవరణలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి కే.సాయికిరణ్ అన్నారు. శనివారం కోర్టు ఆవరణలో న్యాయవాదులు, పోలీసులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. లోక్ అదాలత్‌లో కేసులు సత్వరమే పరిష్కరించుకోవచ్చని, న్యాయవాదులు, పోలీసులు కక్షిదారులకు తెలియజేయాలని అన్నారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్మిరెడ్డి, సత్తన్న, న్యాయవాదులు, పోలీసులు, పాల్గొన్నారు.
యూరియా కోసం రైతుల బారులు
దండేపల్లి: మండలంలోని నెల్కివెంకటాపూర్, గూడెం సహకార సంఘాల వద్ద యూరియా కోసం రైతులు శనివారం బారులు తీరారు. ఉన్న నిల్వలను రెండెకరాలకు ఒక బస్తా చొప్పున పంపిణీ చేశారు. రైతులు అందరూ ఒకేసారి రావడంతో సిబ్బంది వరుసలో నిలబెట్టి బస్తాలు అందజేశారు. సోమవారం వరకు మరో 70 మెట్రిక్ టన్నులు యూరియా వస్తుందని ఏవో గొర్ల అంజిత్ తెలిపారు. యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు.

లోక్ అదాలత్ విజయవంతం చేయాలి