
కళోత్సవ్ పోటీలు ప్రారంభం
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సైన్స్ కేంద్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో కళోత్సవ్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. రెండ్రోజులపాటు ఆరు విభాగాల్లో నిర్వహించే ఈ పోటీల్లో వివిధ పాఠశాలలకు చెందిన 350మంది విద్యార్థులు ప్రదర్శనలు ఇచ్చారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఈవో యాదయ్య మాట్లాడుతూ విద్యార్థుల కళానైపుణ్యాల ప్రదర్శనకు కళోత్సవ్ పోటీలు చక్కని వేదికని అన్నారు. శాసీ్త్రయ, జానపద నృత్యాలు, వాయిద్య, గాత్ర సంగీతం పోటీలు నిర్వహించారు. విద్యార్థుల ప్రదర్శనలు అలరించాయి. సెప్టెంబర్ 1న డ్రామా, స్టోరీ టెల్లింగ్, డ్రాయింగ్, శిల్పకళల పోటీలు నిర్వహిస్తారు. న్యాయనిర్ణేతలుగా శాంకరి, ఆర్కే ప్రసాద్, రాజన్న, సుమన చైతన్య, సంతోష్, జనార్థన్, మూర్తి వ్యవహరించారు. కార్యక్రమంలో క్వాలిటీ కో–ఆర్డినేటర్ సత్యనారాయణమూర్తి, సెక్టోరల్ ఆఫీసర్ చౌదరి, జైపూర్ ఎంఈవో శ్రీనివాస్ పాల్గొన్నారు.