
రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి
చెన్నూర్‌రూరల్: కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో మునిగిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని నాగపూర్ గ్రామంలో నీటమునిగిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. వెంకటేశ్వర్‌గౌడ్ మాట్లాడుతూ ఇప్పటికి మూడు సార్లు పంటలు మునిగిపోతే ఏ ఒక్క అధికారి, నాయకుడు వచ్చి చూసిన దాఖలాలు లేవన్నారు. ప్రభుత్వం కరకట్ట కట్టించి రైతులను ఆదుకోవాలని అన్నారు. ఎకరానికి రూ.25వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బుర్ర రాజశేఖర్‌గౌడ్, లక్ష్మీనారాయణరెడ్డి, జాడి తిరుపతి పాల్గొన్నారు.