
యూరియా కోసం బారులు
వేమనపల్లి/తాండూర్: యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. వేమనపల్లి మండలం నీల్వాయి పీఏసీఎస్ వద్ద రెండ్రోజులుగా రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. 440బస్తాలు రాగా శుక్రవారం మహిళలు ఆర్‌అండ్‌బీ రోడ్డు వరకు బారులు తీరారు. ఏఓ వీరన్న ఒక్కో రైతుకు ఒక్క బస్తా అందజేస్తున్నారు. ఒక్క బస్తా కోసం పనులు మానుకుని పొద్దంతా పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాండూర్‌లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి 15టన్నుల యూరియా సరఫరా కాగా శుక్రవారం రైతులకు పంపిణీ చేశారు. ౖకొందరికి బస్తాలు దొరకక నిరాశతో వెనుదిరిగారు.