
ఓటరు జాబితా స్పష్టంగా ఉండాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: స్థానిక సంస్థల ఎన్నికలకు తుది ఓటరు జాబితా స్పష్టంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావుతో కలిసి పంచాయతీ శాఖ అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు, పోలింగ్ కేంద్రాల జాబితాపై అభ్యంతరాలు, దరఖాస్తులను పరిశీలించి సెప్టెంబర్ 2న తుది జాబితా ప్రచురిస్తామని అన్నారు.
క్రీడల ద్వారా క్రమశిక్షణ
క్రీడల ద్వారా క్రమశిక్షణ, ఆరోగ్యం, వ్యక్తిత్వ వికాసం పెంపొందుతాయని జిల్లా అదనపు కలెక్టర్ పి.చందయ్య అన్నారు. జాతీయ క్రీడ దినోత్సవాన్ని పురష్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా క్రీడా యువజన సేవల అధికారి హనుమంత్‌రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి హాజరయ్యారు.
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలి
బెల్లంపల్లి/భీమిని: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. శుక్రవారం ఆయన బెల్లంపల్లి మండల కేంద్రంలోని వెనుకబడిన తరగతుల ఇంటర్మీడియెట్, డిగ్రీ కళాశాల వసతిగృహం, భీమిని మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలను జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి పురుషోత్తం నాయక్‌తో కలిసి సందర్శించారు.