
ఒకటిన సీపీఎస్ విద్రోహక దినం
మంచిర్యాలటౌన్: జిల్లా ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఒకటిన సీపీఎస్ విద్రోహక దినం నిర్వహించాలని, జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయాలని కమిటీ చైర్మన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ భవన్‌లో శుక్రవారం సీపీఎస్ విద్రోహక దినం నిరసన సమాయత్తంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల పాలిట శాపంగా మారిన సీపీఎస్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమూలంగా రద్దు చేసి, పాత పెన్షన్ విధానం బేషరతుగా పునరుద్ధరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీఈజేఏసీ కో చైర్మన్లు పొన్న మల్లయ్య, శ్రీపతి బాపు, దరణికోట వేణుగోపాల్, పోడేటీ సంజీవ్, ఏ.రమేశ్, బి.వెంకటేశ్వర్లు, పి.సత్తయ్య, ఆర్.రవి, సుమిత్, డిప్యూటీ చైర్మన్ భూముల రామ్మోహన్, వైస్ చైర్మన్లు ఎస్.గంగాధర్, జయకృష్ణ, రాజవేణు పాల్గొన్నారు.