
గోదావరి ఉధృతిని పరిశీలించిన మాజీ మంత్రి జీవన్‌రెడ్డి
జన్నారం: మండలంలోని కలమడుగు గోదా వరి వంతెన వద్ద వరద ఉధృతిని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఆయన వచ్చిన విషయం తెలుసుకున్న కలమడుగు, కమ్మునూరు ప్రజలు వెళ్లారు. అ నంతరం కలమడుగు గ్రామానికి రాగా స్థానికులు శాలువాలతో సన్మానించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 5.25లక్షల క్యూసెక్కులు, కడెం ప్రాజెక్టు నుంచి 30వేల క్యూసెక్కులు వరద వస్తోందని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి పాలనలో తాను నిర్మించిన గోదావరి వంతెన గురించి గ్రామస్తులతో జ్ఞాపకాలను పంచుకున్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఆయన వెంట స్వదేశ్‌కుమార్, బొంతల మల్లేశ్, గట్టు మల్లేశ్, తదితరులున్నారు.