
గోల్డ్‌లోన్ ఫైనాన్స్‌ల్లో పోలీసుల సోదాలు
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రం మంచిర్యాలలోని గోల్డ్‌లోన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలపై పోలీసులు శుక్రవారం ఏకకాలంలో దాడులు చేశారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు నేతృత్వంలో సీఐలు, ఎస్సైలు సుమారు వంద మంది పోలీసులు, ప్రత్యేక బలగాలు బృందాలుగా ఏర్పడి ఆకస్మిక సోదాలు నిర్వహించారు. చెన్నూర్‌లోని ఎస్‌బీఐ బ్రాంచి–2లో బంగారు ఆభరణాలు, నగదు కుంభకోణం నేపథ్యంలో సోదాలు చేసినట్లు తెలిసింది. ఈ కేసులో ప్రధాన నిందితులను చాకచక్యంగా గుర్తించి అదుపులోకి తీసుకోగా.. విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ముత్తుట్ గోల్డ్ లోన్ ఫైనాన్స్, ఎస్‌బీఎఫ్‌సీ గోల్డ్‌లోన్ ఫైనాన్స్‌లతో కలిసి మరో 8 గోల్డ్‌లోన్, ఫైనాన్స్ సంస్థలపై సోదాలు నిర్వహించారు.