
‘గడ్డెన్నవాగు’కు తగ్గని వరద
భైంసాటౌన్: పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రా జెక్ట్‌లోకి శుక్రవారం భారీగా వరదనీరు చేరింది. ఎగువన మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు రెండు రోజులుగా ఇన్‌ఫ్లో కొనసాగుతూనే ఉంది. ఉదయం 20వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, రెండు, మూడు గేట్ల ద్వారా సుమారు 20 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. మధ్యాహ్నానికి ఇన్‌ఫ్లో మరింత పెరగడంతో మరో రెండు గేట్లు ఎత్తి 37వేల క్యూ సెక్కులు దిగువకు వదిలారు. వరద గేట్లకు దిగువ ప్రాంతంలోగల గణేశ్‌నగర్ కోతి హనుమాన్ ప్రాంతంలో కుభీర్‌కు వెళ్లే రోడ్డు పూర్తిగా నీట మునిగింది. అటువైపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే ఆటోనగర్‌తోపాటు రాహుల్‌నగర్‌లోని డ బ్బా కాలనీ, భాగ్యనగర్‌లోకి వరదనీరు చొ చ్చుకువచ్చింది. దీంతో అధికారులు ముందస్తుగా ఆయా కాలనీవాసులను పునరావాస కేంద్రానికి తరలించారు. సాయంత్రానికి ఇన్ ఫ్లో తగ్గడంతో ఒక గేటు మూసివేశారు. ప్రా జెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 358.70 మీటర్లు కాగా, ప్రస్తుతం 358.20 మీటర్ల నీటిమట్టం కొనసాగిస్తూ నాలుగు గేట్ల ద్వారా 30వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.