
ముందస్తుగా ఎంసీహెచ్ ఖాళీ
● గర్భిణులు, బాలింతల తరలింపు ● ఎంసీహెచ్‌కు వరద ముప్పు
మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రానికి గోదావరి నది వరద ముప్పు పొంచి ఉండడంతో గురువారం ముందస్తుగా రక్షణ చర్యలు చేపట్టారు. భారీ వర్షాలు, ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ముంపు పొంచి ఉండడంతో ఆస్పత్రిలో ప్రసవమైన వారిలో ఆరోగ్యంగా ఉన్నవారిని డిశ్చార్జీ చేశారు. గర్భిణులు, బాలింతలు 138మందిని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రితోపాటు సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. వరద ఉధృతి తగ్గిన తర్వాత మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.