
జిల్లాలో 883 మండపాలు
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
నవరాత్రోత్సవాల్లో పోలీ సు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. మండపాల వద్ద 24గంటలూ నిఘా ఉండేలా సీసీ కెమెరాలు అమర్చుకోవాలి. ఉత్సవాలు అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపే విధంగా ఉండాలి. విషాదాన్ని మిగిల్చే విధంగా ఉండకూడదు.
– డీసీపీ ఎగ్గడి భాస్కర్, మంచిర్యాల
మంచిర్యాలక్రైం: జిల్లాలో వినాయక విగ్రహాల ఏ ర్పాటుకు పోలీసులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మంగళవారం వరకు 883 వినాయక ప్రతిమల ఏర్పాటుకు దరఖాస్తులు రాగా అందరికీ అనుమతి ఇచ్చారు. జిల్లా వ్యా ప్తంగా ఆయా పోలీసుస్టేషన్ల పరిధిలో కొందరు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది జిల్లాలో 2,316 ప్రతిమలు ఏర్పాటు చేశారు. బుధవారం వరకు మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఈసారి గతం కంటే ఎక్కువ ఏర్పాటు కావొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. బుధవారం నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు.
నిఘా, పెట్రోలింగ్ వ్యవస్థ పటిష్టం
నవరాత్రుల ఉత్సవాలపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా, రాత్రి, పగలు పెట్రోలింగ్‌కు వ్యవస్థను పటిష్టం చేసింది. ప్రశాంత వాతావరణంలో ఉత్సవాల నిర్వహణకు అన్ని విధాల సిద్ధం చేసింది. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ప్రతీ వినాయక విగ్రహాన్ని జియో ట్యాగింగ్ చేయనున్నారు. ఇదే సమయంలో ముస్లింల పండుగ మిలాద్ ఉన్ నబీ ఉండడంతో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నా రు. ఇప్పటికే రెండుసార్లు రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హిందు, ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించి పలు సూచనలు చేశారు.

జిల్లాలో 883 మండపాలు