
ఉత్పత్తి వ్యయం తగ్గించాలి
శ్రీరాంపూర్/మందమర్రిరూరల్: ఉత్పత్తి వ్యయం తగ్గించుకోవాలని సింగరేణి డైరెక్టర్(పీపీ) కొప్పుల వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం ఆయన శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలో జీఎంలు, సేఫ్టీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేకే ఓసీని ఏరియా జీఎం దేవేందర్‌తో కలిసి సందర్శించారు. బొగ్గు ఉత్పత్తి, ఓబీ వెలికితీత పనుల వివరాలు తెలుసుకున్నారు. కేకే–5గనిలోకి దిగి పని స్థలాలు పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో మా ట్లాడుతూ 30న శ్రీరాంపూర్ ప్రగతి మైదానంలో 55వ వార్షిక రక్షణ వారోత్సవాల బహుమతి ప్రదానోత్సవం విజయవంతం చేయాలన్నారు. వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జీఎం కే.రఘుకుమార్, రామగుండం రీజియన్ సేఫ్టీ జీఎం మధుసూదన్, శ్రీరాంపూర్ ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్, ఎస్వో టు జీఎం విజయ్‌ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.