
ఎయిడ్స్‌పై అవగాహన ఉండాలి
మంచిర్యాలటౌన్: ప్రతి ఒక్కరూ ఎయిడ్స్‌పై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎయిడ్స్, క్షయ నివారణ అధికారి డాక్టర్ సుధాకర్‌నాయక్ అన్నా రు. హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై యువతకు అవగాహన కల్పించేందుకు స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. విజేతలకు సర్టిఫికేట్లు, బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, ఎయిడ్స్ కోఆర్డినేటర్ నీలిమ, డాక్టర్ శివప్రతాప్, డాక్టర్ ఫాతిమా, అల్లాడి శ్రీనివాస్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
వైద్య శిబిరం
భీమిని: సత్వర వ్యాధి నిర్ధారణే క్షయవ్యాధి నివారణకు మార్గమని జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ అన్నారు. సోమవారం కన్నెపల్లి మండలం జజ్జరవెల్లి గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. పలువురికి వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. వైద్యులు అనిల్‌కుమార్, జూబేయిర్, సూపర్‌వైజర్ శశికాంత్, సీఎచ్‌వో జలపతి, హెచ్‌వీ ఇందిరా, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.