
కుటుంబ కలహాలతో సింగరేణి కార్మికుడు..
శ్రీరాంపూర్: కుటుంబ కలహాలతో సింగరేణి కార్మికుడు గోర్కె శ్రీనివాస్(40) సీతారాంపల్లి వద్ద గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సీసీసీ నస్పూర్ ఎస్సై ఉపేందర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరాంపూర్ ఏరియా హిమ్మత్‌నగర్‌కు చెందిన గోర్కె శ్రీనివాస్‌కు అదే ప్రాంతానికి చెందిన కొండపాక స్వరూపతో 2014లో వివాహామైంది. వీరికి కూతురు ఉంది. కాసిపేట 2 గనిలో ఉద్యోగరీత్యా రామకృష్ణాపూర్ ఏరియాలో నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య ఆర్థిక పరమైన అంశాల్లో గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి శ్రీనివాస్ భార్య కుటుంబ సభ్యులు అతడిని మందలించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన శ్రీనివాస్ సీతారాంపల్లి గోదావరి నది వద్దకు వెళ్లి తన తల్లి రాజమ్మకు ఫోన్ చేసి తాను చనిపోతున్నానని తెలిపాడు. రాజమ్మ అల్లుడు రమేశ్, చుట్టుపక్కల వారు గోదావరి నది పుష్కర్ ఘాట్ వద్దకు వెళ్లారు. అప్పటికే శ్రీనివాస్ గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి రాజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.