
గోదావరి పరిరక్షణకు పాదయాత్ర
మంచిర్యాలరూరల్(హాజీపూర్): గోదావరి పరిరక్షణ కోసం మహారాష్ట్రలోని గంగోత్రి ఆశ్రమ భక్తులు పాదయాత్ర చేస్తున్నారు. మహారాష్ట్రలోని పర్బని జిల్లా గంగాఖేడ్‌లోని గంగోత్రి ఆశ్రమానికి చెందిన పది మంది భక్తులు చేపట్టిన పాదయాత్ర సోమవారం హాజీపూర్ మండలానికి చేరింది. ఆగస్టు 3న గోదావరి పుట్టిన పవిత్ర ప్రదేశమైన త్రయంబకేశ్వర్ నుంచి పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. గోదావరి పరీవాహక ప్రాంతాన్ని మొత్తంగా ప్రదక్షిణ చేస్తున్నట్లు తెలిపారు. మరో 25 రోజుల్లో గోదావరి నది సముద్రంలో కలిసే అంతర్వేదికి చేరుకుంటామని అన్నారు. 10 మంది సభ్యులు, ముగ్గురు సహాయకులతో కలిసి రోజుకు 50 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేస్తున్నారు. నవంబర్ 3న గోదావరి ప్రదక్షిణ పూర్తి చేసి తిరిగి తమ ఆశ్రమానికి చేరుకుంటామని తెలిపారు.