
వన్యప్రాణులను హతమార్చిన ఇద్దరి అరెస్ట్
సాత్నాల: వన్యప్రాణులను వేటాడిన ఘటనలో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎఫ్‌ఆర్‌వో గులాబ్ సింగ్ తెలిపారు. మహారాష్ట్రలోని పాండ్రకోడా అటవీ పరిసర ప్రాంతాల్లో నాలుగు నెమళ్లు, ఓ నిలుగాయిని పలువురు వేటాడి హతమార్చారు. మహారాష్ట్ర పార్వ గ్రామానికి చెందిన నిలేష్ చౌహాన్, రాథోడ్ రోహన్ పట్టుపడగా, భోరజ్ మండలం గిమ్మ గ్రామానికి చెందిన సందీప్ రాథోడ్, సంజీవ్ పరారీలో ఉన్నారు. హతమార్చిన వన్యప్రాణుల మాంసాన్ని గిమ్మ గ్రామంలో విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు ఎఫ్ ఆర్వో తెలిపారు. వన్యప్రాణుల పరిరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.