
రైలు కిందపడి వృద్ధుడి మృతి
మందమర్రిరూరల్: పట్టణంలోని రామన్ కాలనీ సమీపంలో ఫ్‌లైఓవర్ బ్రిడ్జి వద్ద రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని వృద్ధుడు మృతిచెందాడని రైల్వే హెడ్ కానిస్టేబుల్ సురేష్‌గౌడ్ తెలిపారు. సోమవారం ఉదయం 11గంటలకు మంచిర్యాల వైపు నుంచి బెల్లంపల్లి వైపు వెళ్లే రప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి మృతిచెందాడని పేర్కొన్నారు. మృతదేహం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉందని, సంబంధీకులు 9490871784, 9948481902 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.
విద్యుదాఘాతంతో రిటైర్డు కార్మికుడు మృతి
శ్రీరాంపూర్: నస్పూర్‌లోని తీగల్ పహాడ్ రాంనగర్‌కు చెందిన సింగరేణి రిటైర్డు కార్మికుడు దొరిశెట్టి నారాయణ(62) సోమవారం విద్యుదాఘాతంతో మృతిచెందాడు. నస్పూర్ ఎస్సై ఉపేందర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణ రామ్‌నగర్‌లో నిర్మించుకుంటున్న ఇంటికి నీరు పట్టేందుకు బోర్ మోటార్ స్టార్టర్ స్విచ్ఛాన్ చేయబోయాడు. ఈ క్రమంలో కరెంటు వైరు షాక్ తగలడంతో కింద పడిపోయాడు. చుట్టుపక్కల వారు మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే అతడు మృతిచెందాడని ధ్రువీకరించారు. మృతుడి భార్య మల్లక్క ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
లక్ష్యసాధనకు కృషి చేయాలి
శ్రీరాంపూర్: కంపెనీ నిర్ధేశించిన వార్షిక ఉత్పత్తి లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) కే.వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం ఆయన శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిని సందర్శించారు. అధికారులతో కలిసి క్వారీలో దిగి పని స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్ధేశించిన ఓవర్ బర్డెన్ మట్టిని తొలగించాలన్నారు. ఓబీ సంస్థలు తమ లక్ష్యాన్ని అనుగుణంగా పనిచేయాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఓపెన్ కాస్ట్ గనికి నిర్ధేశించిన 35 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని నూరు శాతం సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ జీఎం ఎం.శ్రీనివాస్, ఎస్సార్పీ ఓసీపీ అధికారి చిప్ప వెంకటేశ్వర్లు, ఇందారం ఓసీపీ అధికారి కే.వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్సార్పీ ఓసీపీ గని మేనేజర్ ఐ.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సుంగాపూర్ శివారులో 95 గంజాయి మొక్కలు స్వాధీనం
నార్నూర్: ఎస్పీ ఆదేశాల మేరకు మండలంలో ని సుంగాపూర్ శివారులో గంజాయి సాగు చే స్తున్నట్లు అందిన సమాచారంతో సీసీఎస్, నా ర్నూర్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. గ్రామానికి చెందిన కొడప దేవ్‌రావు సా గు చేస్తున్న 95 గంజాయి మొక్కలను స్వాధీన పరుచుకుని, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 12.4 కిలోల బరువు గల వీటి వి లువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.9.5 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. నార్నూర్ సీఐ ప్రభాకర్, ఎస్సై అఖిల్, సీసీఎస్, పోలీసులు పాల్గొన్నారు.

రైలు కిందపడి వృద్ధుడి మృతి

రైలు కిందపడి వృద్ధుడి మృతి

రైలు కిందపడి వృద్ధుడి మృతి