
గంజాయి విక్రయించే యువకుడు అరెస్ట్
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని జాఫర్‌నగర్‌లో గంజాయి విక్రయించేందుకు యత్నించిన యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు స్థానిక సీఐ ప్రమోద్‌రావు తెలిపారు. మంచిర్యాలకు చెందిన గూడెల్లి సాయికుమార్ అనుమానాస్పందగా సంచరిస్తుండగా అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. అతడి వద్ద 205 గ్రాముల గంజాయి లభించిందని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని బల్లార్షకు వెళ్లి గంజాయి కొనుగోలు చేశాడని, కొందరికి విక్రయించేందుకు వచ్చాడని అన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
ఉద్యోగం పేరిట మోసగించిన వ్యక్తులకు జైలు శిక్ష
చెన్నూర్: సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించిన ముగ్గురు వ్యక్తులకు ఆరు నెలల జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య సోమవారం తీర్పునిచ్చారు. వివరాలిలా ఉన్నాయి. సింగరేణి ఉద్యోగం ఇప్పిస్తామని చెన్నూర్ పోలీసుస్టేషన్ పరిధి ఆదర్శనగర్‌కు చెందిన వంగల తిరుపతి వద్ద రూ.17లక్షలు, వంగల మధూకర్ వద్ద రూ.8లక్షలను గోదావరిఖనికి చెందిన వొజ్జ కొమురయ్య, రామకృష్ణాపూర్‌కు చెందిన ఎడ్ల భీమయ్య, ఎడ్ల రాజిరెడ్డి, అబ్దుల్ సలీమ్, కొత్తగూడెంకు చెందిన ఉండేటి ప్రశాంత్‌కుమార్, కొత్త వెంకటయ్య, మూరల హర్షవర్ధన్‌రావు, ఎల్లూరి వెంకటనిర్మలకుమార్‌లు తీసుకున్నారు. ఉద్యోగం ఇప్పించకపోవడంతో డబ్బులు ఇవ్వాలని వారు ఒత్తిడి తెచ్చారు. 2016 ఆగస్టు 27న ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అప్పటి ఎస్సై బీ.చంద్రయ్య కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. విచారణలో కొందరిపై నేరం రుజువు కాకపోగా, నేరం రుజువైన ఎడ్ల రాజిరెడ్డి, ఉండేటి ప్రశాంత్, ఎల్లూరి వెంకటనిర్మలకుమార్‌లకు ఆరు నెలల జైలు శిక్ష, రూ.3వేల చొప్పున జరిమానా విధించారు.
బాలింతకు దారి కష్టాలు
బోథ్: సొనాల మండలంలోని పెద్దగూడ గ్రామానికి చెందిన రేణుక బోథ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. తల్లీబిడ్డను పెద్దగూడకు 102 వాహనంలో తరలిస్తుండగా గ్రామానికి చేరువలో ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో పైలట్ భగత్ నవీన్ కుమార్ పసికందుతో పాటు తల్లిని తీసుకుని జాగ్రత్తగా వాగు దాటించాడు. వారిని క్షేమంగా ఇంటికి చేర్చాడు. కాగా, వంతెన లేక ఆదివాసీల ఇక్కట్లకు ఈ ఘటన ఓ నిదర్శనం.

గంజాయి విక్రయించే యువకుడు అరెస్ట్