
‘సమస్యల పరిష్కారానికి నిరసనలు’
శ్రీరాంపూర్: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కా రం, కొత్త గనుల సాధన కోసం నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు టీబీజీకేఎ స్ నాయకులు తెలిపారు. ఆదివారం నస్పూ ర్ కాలనీలోని శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రె డ్డి, ఏరియా ఉపాధ్యక్షుడు బండి రమేశ్‌లు మాట్లాడారు. వాస్తవ లాభాలు ప్రకటించి 35శాతం వాటా ను కార్మికులకు పంచాలని డిమాండ్ చేశారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.43 వేల కోట్ల బకాయిలు విడుదల చేయాలని పేర్కొన్నారు. అన్ని డి మాండ్ల సాధనకు ఈ నెల 28న అన్ని జీఎం కార్యాయాలు, డిపార్టుమెంట్ల వద్ద నల్లబ్యాడ్జీ లు ధరించి అధికారులకు మెమోరాండం సమర్పిస్తామన్నారు. 29న జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా, సెప్టెంబర్ 2న చలో కొత్తగూడెం కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. యూనియన్ కేంద్ర కమిటీ నాయకులు పానుగంటి సత్తయ్య, పొగాకు రమేశ్, అన్వేశ్‌రెడ్డి, గొర్ల సంతోష్, నాయకులు తొంగల రమేశ్, వెంగళ కుమారస్వామి, తిరుమల్‌రావు తదితరులు పాల్గొన్నారు.