
పేకాట స్థావరాలపై దాడులు
కౌటాల: మండలంలోని తాటినగర్ గ్రామంలో పేకాట ఆడుతున్న తొమ్మిది మంది వ్యక్తులను ఆదివారం రాత్రి కౌటాల పోలీసులు ప ట్టుకున్నట్లు ఎస్సై విజయ్ తెలిపారు. ఎస్సై తె లిపిన వివరాల ప్రకారం.. తాటినగర్ గ్రామంలో పేకాట ఆడుతున్న విశ్వేశ్వర్‌రావు, శంకర్, యం.రవి, కె.బాబురావ్, ఆర్.దివాకర్, జి.నా గేశ్, కె.మారుతి, జి.బాపు, సంతోష్‌లను పట్టుకొని వారి వద్ద నుంచి రూ.10,300 నగదు, 5 సెల్‌ఫోన్లు, 52 పేకాట ముక్కలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 9 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో పోలీసులు పాల్గొన్నారు.
వాంకిడి: మండలంలోని ఖమానా గ్రామ శివారులో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై వాంకిడి పోలీసులు ఆదివారం దా డులు నిర్వహించి ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమాన గ్రామ శివారులో పేకాట స్థావరం నిర్వహిస్తున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించగా ఐదుగురు పట్టుబడినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.10,820 స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.