
డ్యూటీకి అనుమతించాలని నిరసన
మంచిర్యాలఅర్బన్: ఆర్టీసీ డ్రైవర్లను డ్యూటీకి అనుమతించి విధులు కేటాయించాలని మంచిర్యాల డిపో ఎదుట డ్రైవర్లు ఆదివారం నిరసన తెలిపారు. పర్మినెంట్ డ్రైవర్లు కాకుండా తాత్కాలిక పద్ధతిన విధులు నిర్వహిస్తున్న డ్రైవర్లను డ్యూటీలోకి తీసుకుని తమను నిర్లక్ష్యం చేయటంపై ఆందోళన వ్యక్తం చేశారు. వయసు పైబడిన డ్రైవర్లను టిమ్స్ నేర్చుకోవాలని, డబుల్ డ్యూటీలు చేయాలని ఒత్తిడి చేయడం సరికాదన్నారు. ఎన్నడూ లేని విధంగా పర్మినెంట్ డ్రైవర్లను డ్యూటీల్లోకి తీసుకోకపోవటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.