పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలి | - | Sakshi
Sakshi News home page

పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలి

Aug 25 2025 8:28 AM | Updated on Aug 25 2025 8:28 AM

పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలి

పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలి

● జిల్లా జడ్జి వీరయ్య

పాతమంచిర్యాల: వైద్య వృత్తి పవిత్రమైనదని, వైద్యులు దేవునితో సమానమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.వీరయ్య అన్నారు. జిల్లా కేంద్రంలో తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ సమావేశం ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌, హెచ్‌ఆర్డీ, ఓఎస్‌ఎం సభ్యులతో నిర్వహించారు. జిల్లా జడ్జి మాట్లాడుతూ వైద్యులు ప్రజారోగ్య పరిరక్షణకుపాటుపడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. వృత్తికి కళంకం తెస్తున్న వైద్యులు, ఆస్పత్రులపై తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ టాస్క్‌ఫోర్సు తీసుకుంటున్న చర్యలను అభినందించారు. బెల్లంపల్లి అడిషనల్‌ కలెక్టర్‌ మనోజ్‌ మాట్లాడుతూ, వైద్య వృత్తిని వ్యాపారం చేస్తూ ప్రజారోగ్యానికి ముప్పు తీసుకురావొద్దన్నారు. అనంతరం జిల్లా జడ్జి, అడిషనల్‌ కలెక్టర్‌ను మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి హరీశ్‌రాజ్‌, ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ విశ్వేశ్వర్‌రావు, వైద్యులు యెగ్గెన సునీత, రమణ, అనిల్‌కుమార్‌, కిరణ్‌, నరేశ్‌, తెలంగాణ మెడికల్‌ టాస్క్‌ఫోర్సు అసోసియేట్‌ సభ్యులు, అడ్వకేట్‌లు ఆకుల రవీందర్‌, సల్ల నరేశ్‌, సురేందర్‌, ఐఆర్‌ిసీఎస్‌ ప్రధాన కార్యదర్శి చందూరీ మహేందర్‌, అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసీక్యూటర్‌ నంది రవీందర్‌, బార్‌ ఆసోసియేషన్‌ అధ్యద్యక్షుడు జగన్‌, అడ్వకేట్‌లు కోట మల్లయ్య, జగన్‌, వైద్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement