
సదాస్మరణీయం పుస్తక పరిచయం
మంచిర్యాలఅర్బన్: జిల్లా సాహితీ సంరక్షణ సమితి ఆధ్వర్యంలో స్థానిక సరస్వతీ శిశుమందిర్‌లో కవియిత్రి సుబ్బాయమ్మ రచించిన సదాస్మరణీయులు పుస్తక పరిచయం ఆదివా రం నిర్వహించారు. సీనియర్ అభియంత సాధుల నందమయ్య, అధ్యాపకులు నోముల చంద్రశేఖర్ రచయిత్రి చిత్రించిన సంఘ సేవకులను, కవులను వారు చేసిన త్యాగనిరతిని కొనియాడాయిని రితీని ఎంతో అద్భుతంగా సమీక్షించారు. రచయిత్రీ సుబ్బాయమ్మ ఎంతో ఓర్పుతో దేశ స్వాతంత్య్రం కోసం నిస్వార్థ నాయకుల సేవలను కొనియాడుతూ రాసి పుస్తకం చదవటం ద్వారా సేవాగుణం అలవర్చుకోవాలని సూచించారు. అంతకుముందు నిర్వహించిన కవిసమ్మేళనం అలరించింది. సా హితీ సంస్థ జిల్లా అధ్యక్షుడు వామన్‌రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అల్లాడి శ్రీనివాస్, కవులు అడ్డగూరి శ్రీలక్ష్మి, సంతోష్, సుగుణాకర్, శ్రీనాథ్‌గౌడ్, సుదాంశ్, పద్మజ, సుజాత, ప్రవీమ, వెంకట్రాయశర్మ కవితాగానం చేశారు.