
ఫ్రెండ్లీ క్రికెట్ పోటీ
మంచిర్యాలక్రైం: మంచిర్యాల–బెల్లంపల్లి బార్‌అసోసియేషన్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని తిలక్‌నగర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన ఫ్రెండ్లీ మ్యాచ్ క్రికెట్ పోటీలో మంచిర్యాల బార్‌అసోసియేషన్ టీం విజేతగా నిలిచింది. బెల్లంపల్లి, మంచిర్యాల బార్ అసోసియేషన్ మధ్య హోరాహోరీగా మ్యాచ్ జరిగింది. మొదటగా మంచిర్యాల టీ మ్ బ్యాటింగ్ చేసింది. 15 ఓవర్లలో 7 వికెట్ల కోల్ప యి 102 పరుగులు చేసింది. బెల్లంపల్లి టీం 15 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 100 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది.