నిత్య పూజల్లో ‘కొరడి గణపతి’ | - | Sakshi
Sakshi News home page

నిత్య పూజల్లో ‘కొరడి గణపతి’

Aug 24 2025 8:38 AM | Updated on Aug 24 2025 8:38 AM

నిత్య పూజల్లో  ‘కొరడి గణపతి’

నిత్య పూజల్లో ‘కొరడి గణపతి’

భైంసారూరల్‌: మాటేగాం గ్రామంలో కొరడి గణపతి అనునిత్యం పూజలు అందుకుంటున్నాడు. 2017లో కొరడి గణపతిని ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. గ్రామానికి చెందిన పిప్పెర ప్రకాశ్‌ పటేల్‌ ఇంటి ముందు కుప్పగా పోసిన కట్టెల్లో పిల్లలకు గణపతిరూపం కనిపించింది. ఈ విషయాన్ని పెద్దలకు చెప్పడంతో అందరూ అక్కడికి చేరుకున్నారు. అనంతరం గ్రామంలో గణపతిని ప్రతిష్టించి పూజలు చేశారు. కట్టె రూపంలో దొరికిన ఈ గణపతిని కొరడి గణపతిగా పిలుస్తున్నారు. కాగా గ్రామస్తులు కొరడి గణపతికి మందిర నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు.

ప్రతీరోజు పూజలు

కొరడి గణపతికి పూజలు చేసేందుకు ప్రతీరోజు భక్తులు వస్తుంటారు. వినాయక నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

– మాధవ్‌రావు, పూజారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement